వరుణ్ తేజ్ జోడీగా లావణ్య త్రిపాఠి

వాస్తవం సినిమా: వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు సంకల్ప్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో ఈ కథ కొనసాగనుంది. వ్యోమగామి పాత్రలో ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కావ్యా తాపర్ ను తీసుకోనున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా లావణ్య త్రిపాఠి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరూ నటిస్తున్నారా .. లేదంటే కావ్యా తాపర్ ను తీసుకోవడం లేదా అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఒక కీలకమైన పాత్రలో అదితీరావు కనిపించనుందని అంటున్నారు. హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. గతంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి ‘మిస్టర్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రేసులో కాస్త వెనుకబడిన లావణ్య త్రిపాఠికి ఈ సినిమా కలిసొస్తుందేమో చూడాలి.