లింగ సమానత్వం అంటూ మగ పిల్లలకు స్కర్ట్స్

వాస్తవం ప్రతినిధి: లింగ సమానత్వం అనేది కేవలం మాటల్లోనే కాదు అంటూ చేతల్లో నిరూపించింది లండన్. లింగ సమానత్వం కోసం బ్రిటన్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాల వినూత్న నిర్ణయం తీసుకున్నది. విద్యార్థుల మధ్య లింగభేదాన్ని తొలిగించేందుకు మగపిల్లలు ఇకపై అమ్మాయిల మాదిరిగా తమకు ఇష్టమైన స్కర్ట్స్ వేసుకోవచ్చని పేర్కొన్నది. అదేవిధంగా విద్యార్థుల్ని విడదీసేలా ఉన్న మగ, ఆడ విద్యార్థులకు బదులుగా ప్యూపిల్ అని పిలువాలని కూడా ఆ పాఠశాల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈస్ట్ మిడ్‌ల్యాండ్ పరిధిలోని రుత్‌ల్యాండ్ అప్పింగమ్ పాఠశాల ఈ వినూత్న నిర్ణయానికి వేదికైంది. ఇకపై మా పాఠశాలలో విద్యార్థులు వారికిష్టమైన డ్రెస్‌లు వేసుకునేందుకు అనుమతిస్తున్నాం. లింగసమానత్వం కోసమే ఇదంతా చేస్తున్నాం అని అంటున్నారు.