ప్రతి పక్ష పార్టీ నేతగా భారత సంతతి ఎంపీ

వాస్తవం ప్రతినిధి:  సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతి ఎంపీ ప్రీతం సింగ్ (41) ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో సింగపూర్ ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ కొత్త సెక్రటరీ జనరల్‌గా సభ్యులు ప్రీతంను ఎన్నుకోవడం తో ఆయన ఎన్నిక సుగమం అయినది. 2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రెటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న ఆయన న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో 2011 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లో థియా ఖియాంగ్‌పై ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించిన ఆయన ఇప్పుడు తాజాగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. లో ప్రకటనతో సెక్రటరీ జనరల్ పదవీకోసం ప్రీతం సింగ్ పేరు ముందువరుసలో నిలిచింది.