ప్రజల సొమ్మును దోచుకున్న జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదు: జీవీ

వాస్తవం ప్రతినిధి:  ప్రజల సొమ్మును దోచుకున్న జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. మోదీని ప్రశ్నించడానికి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే మోదీ ఇంటిముందు జగన్ ధర్నా చేయాలని ఆంజనేయులు సవాల్ విసిరారు.ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే అరెస్ట్ చేయించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

 చంద్రబాబును జగన్ బావిలో దూకమంటున్నారు… 2019 ఎన్నికల తర్వాత జగన్ బావిలో దూకాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. కాగ్ నివేదికలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని… వైఎస్ హయంలో, గుజరాత్‌లో మోదీ హయాంలో కాగ్ నివేదికలపై కూడా చర్చకు సిద్ధం కావాలని జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు.