తిరుపతిలో టీడీపీ,బీజేపీ మధ్య వార్!

వాస్తవం ప్రతినిధి: తిరుపతిలో టిడిపి, బిజెపి నాయకుల మధ్య లోకల్‌ వార్‌ నడుస్తోంది. తిరుపతి రూరల్‌ మండలంలోని చెర్లోపల్లిలో బిజెపి నేతలు జెండావిష్కరణకు సిద్దమవ్వడం తో మరోకప్క బిజెపి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని టిడిపి నాయకులు ముందుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుడిపట్ల చెర్లొపల్లిలో బిజెపి కార్యకర్తలు లేకున్నా బయటి వారొచ్చి జెండా ఆవిష్కరణ ఎలా చేస్తారని టిడిపి నాయకులు ఘర్షణకు దిగడం తో  ఏపిలో బిజెపి వద్దు అంటూ నినాదాలు చేశారు. ఏపికి బిజెపి తీరని అన్యాయం చెస్తున్నా ఏ ముఖం పెట్టుకుని జెండా ఆవిష్కరణకు వచ్చారంటూ టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇప్పటికే పోలీసుల బలగాలు అక్కడికి చేరుకుని ఇరు పార్టీ నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.