కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్న కేదార్ జాదవ్

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడుతోన్న కేదార్‌ జాదవ్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అతడి గాయమ కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం అవ్వనున్నాడు. శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌ కొనసాగించలేక వెళ్లిపోయాడు. అనంతరం కొద్ది సేపటి తరువాత  చివరి ఓవర్లో వచ్చి ఒక సిక్స్‌, ఒక ఫోర్‌ బాది చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆదివారం చెన్నై చేరుకుంది. ఈ నేపథ్యంలో తొడ కండరాలు గాయంతో బాధపడుతోన్న కేదార్‌ జాదవ్‌ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు పలు స్కానింగ్‌లు నిర్వహించారు. దీంతో అతను కోలుకోవడానికి కొద్ది సమయం పట్టేట్లు ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు కేదార్‌ దూరమయ్యే అవకాశం ఉంది.