కూతురి తో కలిసి హాజరైన షారూఖ్

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌కి బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ తన కూతురి తో కలిసి హాజరై సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సహ యజమాని షారుక్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆదివారం సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడే తొలి మ్యాచ్‌కు షారుక్‌ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యాడు. భార్య గౌరీ ఖాన్‌, కూతురు సుహానా ఖాన్‌, కుమారుడు అభ్‌రాంతో కలిసి వచ్చాడు. వీరంతా కలిసి మైదానంలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కుమార్తె, తో కలిసి షారుక్‌ మైదానంలో కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 2010లో షారుక్‌.. సుహానాతో కలిసి హాజరయ్యాడు. అప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఫొటోలకు ఇప్పటి వాటిని జతచేసి అభిమానులు పంచుకుంటున్నారు.