‘ ఆఫీసర్’ టీజర్ చెప్పిన టైం కి రిలీజ్ అయ్యిందిగా..

వాస్తవం సినిమా: రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబోలో వస్తున్న ఆఫీసర్ టీజర్ చెప్పిన టైం కి రిలీజ్ చేసేసారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హెడ్ గా నారాయణ్ పసారి అనే మాజీ పోలీస్ ఆఫీసర్ కేసు కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చిన ఓ అధికారి కథే ఇది. ముంబై బ్యాక్ డ్రాప్ కాబట్టి వాతావరణం నటీనటులు మొత్తం అక్కడి సెటప్ లాగే కనిపిస్తోంది. టీజర్ మొత్తంలో తెలుగు నటుల్లో అజయ్ మాత్రమే కనిపించాడు. ఓవర్ ది టాప్ క్రేన్ షాట్స్ పాత వర్మను గుర్తుకు తెస్తే తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేసే దాకా వదిలిపెట్టను అని నాగ్ సీరియస్ గా చెప్పడం మాస్ కి కిక్ ఇచ్చేదే. అలాగే టీజర్ ఉన్నది ఒక్క నిమిషమే అయినా సింగల్ లైన్ లో స్టొరీ రివీల్ చేసిన వర్మ చాలా కాలం తర్వాత తనదైన ట్రేడ్ మార్క్ యాక్షన్ డోస్ ఇందులో బాగా దట్టించినట్టు కనిపిస్తోంది.