అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మాధవన్ కుమారుడికి కాంస్యం

వాస్తవం  ప్రతినిధి:  ప్రముఖ నటుడు మాధవన్‌ కుమారుడు కాంస్య పతకం గెలిచాడు. నిజమే నండీ మాధవన్ కుమారుడు వేదాంత్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించాడట.  వేదాంత్‌కు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్‌ అంటే ఆసక్తి. అదే ఆసక్తి తో ఇప్పుడు అంతర్జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా చేసింది. థాయ్‌లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొన్న వేదాంత్‌ భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టాడు. ఈ విషయాన్ని మాధవన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు, నా భార్య సరితకు ఇది గర్వించదగ్గ విషయం. మా అబ్బాయి వేదాంత్‌ థాయ్‌లాండ్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో భారత్‌కు కాంస్యం సాధించిపెట్టాడు.’ అని ట్వీట్‌ చేస్తూ వేదాంత్‌ ఫొటోను షేర్‌ చేశారు. దాంతో సినీ ప్రముఖులంతా వేదాంత్‌పై సోషల్‌మీడియా ద్వారా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.