హార్దిక్ పటేల్ పై ఇంకు దాడి

వాస్తవం ప్రతినిధి: పటీదార్‌ ఉద్యమ నేత హర్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉజ్జయిని లో ఒక హోటల్ ప్రెస్ మీట్ కోసం బయలు దేరిన ఆయనపై ఓ వ్యక్తి ఇంకుతో దాడి చేశాడు. ఈ హఠాత్‌ పరిణామంతో యువనేత బిత్తర పోగా.. దాడి చేసిన వ్యక్తిని హర్దిక​ అనుచరులు చితకబాదారు. అయితే ఈ దాడికి పాల్పడింది మిలింద్ గుజ్జర్ అనే వ్యక్తి అని అతడిని కొట్టి పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తుంది. పటీదార్‌, గుజ్జర్‌ తెగలను స్వప్రయోజనాల కోసం హర్దిక్‌ వెధవలను చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఇంక్‌ పోసినట్లు మిలింద్‌ వివరించాడు. అయితే విశేషం ఏమిటంటే అంతకు ముందు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన మిలింద్ హార్దిక్ పై ఇంకు దాడి చేస్తాను అని ప్రకటించాడు.