రోహిత్ ని కెప్టెన్ కూల్ అంటూ పోస్ట్ చేసిన రితికా

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్‌-11 సీజన్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మ్యాచ్‌తో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ఈ జట్ల మధ్య పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే ఇరు జట్ల కెప్టెన్లు అయిన మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మ అభిమానుల మధ్య సోషల్‌ మీడియా వేదికగా ఒక గొడవ మొదలైంది. ఇంతకీ ఆ గొడవ ఏంటంటే రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే  కెప్టెన్ కూల్ అంటూ ఉన్న ఒక మ్యాగజైన్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే. అయితే దానికి ధోనీ అభిమానులు మాత్రం కెప్టెన్ కూల్ అంటే ధోనీ ఒక్కడే అర్హుడని సోషల్‌ మీడియా వేదికగా రితికాను నిలదీసారు. కొందరు మర్యాద పూర్వకంగా ఆ ట్యాగ్‌ ధోనిది దయచేసి రోహిత్‌కు ఇవ్వద్దని విజ్ఞప్తి చేయగా..మరి కొందరు.. ‘రితికా ఆ ట్యాగ్‌ కోసం అడుక్కోకు!’ అంటూ సెటైర్‌ వేశారు. ప్రపంచంలో కూల్‌ కెప్టెన్‌ అంటే ధోనినే మరేవరు కాదని ఇంకొందరు కామెంట్‌ చేశారు. అయితే రోహిత్‌ అభిమానులు మాత్రం రోహిత్‌ కూల్‌ కెప్టెనేనని అంగీకరిస్తున్నారు. ముంబైని మూడు సార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లోనే విజయవంతమైన కెప్టెన్‌ అని అతని అభిమానులు ప్రతి వాదనకు దిగారు. అయితే ఈ కామెంట్స్‌పై రితికా సజ్దే మాత్రం స్పందించలేదు.