యువతలో ప్రశ్నించే స్వభావం పెరగాలి:  మాజీ జేడీ లక్ష్మీనారాయణ 

వాస్తవం ప్రతినిధి: యువతలో ప్రశ్నించే స్వభావం పెరగాలని, ఎవరికీ భయపడకుండా సమాజంలోని సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువతని ఉద్దేశించి మాట్లాడుతూ.. విమర్శించే అధికారం యువతకు లేదని, కానీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాత్రం వారికి ఉందని .భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అందుకు యువత పాత్ర చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. యువత ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, యువత గొప్ప నాయకులయిన అబ్దుల్‌ కలాం, స్వామి వివేకానంద, శివాజీలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.