మరో రెండు స్వర్ణాలు,ఒక రజతం!

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్టులో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో నాలుగో రోజు కూడా భారత క్రీడాకారుల పతకాల వేట మొదలైంది. వారణాసికి చెందిన పూనం యాద‌వ్ 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు ప‌త‌కం పొందింది. అలానే ఎయిర్ పిస్టల్ విభాగం లో కూడా హర్యానా కు చెందిన మను భాకర్(16) స్వర్ణం సాదిన్చాగా,హీనా సిధు రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో నాలుగు రోజుల్లో భార‌త్‌కు 6 బంగారు ప‌త‌కాలు రాగా రెండు ర‌జ‌తాలు, కాంస్యం వ‌చ్చాయి. అటు విజేత‌ ల‌కు ప‌లువురు ప్ర‌ముఖులు స‌హా నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది.