నందమూరి తారక రామారావు మనవడినైన నేను.. 

 వాస్తవం సినిమా: ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీర్.. సూపర్ స్టార్ మహేష్‌బాబును పొగడ్తలతో ముంచెత్తారు. ‘నందమూరి తారక రామారావు మనవడినైన నేను’ అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అభిమాన సోదరులందరికీ నమస్కారం అనగానే ఎల్బీ స్టేడియం ఈలలు, అరుపులతో హోరెత్తింది. ‘ఒక్కోసారి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం. బహుశా ఈరోజు నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఈరోజు మా ఇద్దరినీ చూస్తే మీ అందరికీ కొత్తగా ఉందేమో కానీ.. నాకు, ఆయనకు ఇది కొత్త కాదు. మహేష్ బాబును మీరందరూ ‘ప్రిన్స్’, ‘సూపర్ స్టార్’ అంటారు. కానీ, నేను మాత్రం ‘మహేష్ అన్న’ అంటాను. ఈ వేడుకకు నేను ముఖ్యఅతిథిగా రాలేదు..ఓ కుటుంబసభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా. ఓ కమర్షియల్ హీరోగా మహేష్ బాబు చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలను మేమెవరమూ చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పడిప్పుడే మేము కూడా మొదలు పెడుతున్నాం. దీనికి ఇన్సిపిరేషన్ ఆయనే. ‘భరత్ అనే నేను’ మీ కెరీర్ లో ఓ మైలురాలిగా నిలవాలని నేను కోరుకుంటున్నా. సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి, దర్శకుడు కొరటాల శివ. అభిమానులకు కావాల్సిన మసాలాను గట్టిగా దట్టించి, శివ చెప్పదలచుకున్న సందేశాన్ని చిత్రాల ద్వారా అందిస్తారు’ అని అన్నాడు