జైట్లీ కి కిడ్నీ ఆపరేషన్

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ఎయిమ్స్‌ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ఆదివారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగోలేదని,కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ నేపధ్యంలో లండన్ పర్యటనను కూడా రద్దు చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. శనివారం పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను ఒకరోజు పరిశీలనలో ఉంచాగా, ఈ రోజు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నారు. అయితే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించుకునే వారిని ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచడం సాధారణమేనని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, కిడ్నీ దాత సిద్ధంగా ఉన్నారు. నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ సందీప్‌ గులేరియా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది.