జగన్ వ్యాఖ్యలపై  జేసీ ఆగ్రహం  

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ధైర్యం, మగతనం ఉంటే ఐదుగురు ఎంపీలతో కాకుండా మొత్తం ఏడుగురు ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీకి చెందిన అందరు ఎంపీలు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఐదుగురితో రాజీనామా చేయించి, డ్రామాలాడవద్దని ఆయన వైఎస్సార్సీపీ అధినేతకు సూచించారు.