జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉమా

వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై మండిపడ్డారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర యాత్రలాగా లేదని, అదేదో మార్నింగ్ వాక్…ఈవినింగ్ వాక్ లా ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. దొంగను చూడడానికి వచ్చినట్టే జగన్‌ సభలకు జనం వస్తున్నారని ఎగతాళి చేశారు. సీఎంకు ఏడు ప్రశ్నలు వేసిన జగన్‌.. ప్రధానికి ఒక్క ప్రశ్న అయినా వేశావా? అంటూ మంత్రి ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్‌ భాష మార్చుకోవాలని హెచ్చరించడమే కాకుండా సీఎంను బావిలో దూకమని ఎలా అంటావు? అంటూ ఆయన మండిపడ్డారు. అలానే విజయసాయిరెడ్డితో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ తో ఇప్పుడు బీజేపీ తో కుమ్మక్కు కాలేదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.