ఆయనతో నాకు అపైర్ అంటగట్టారు..చాలా భయమేసింది: అనసూయ   

వాస్తవం సినిమా: రంగమ్మత్త క్యారెక్టర్ తన బాధ్యతను మరింత పెంచిందని అనసూయ తెలిపింది. ‘రంగస్థలం’ సినిమా తర్వాత రెమ్యునరేషన్ పెంచాననే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పింది. రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించిన అనసూయ… ఇప్పుడు సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె పంచుకుంది.కెరీర్ ప్రారంభంలో హెచ్ఆర్ ఉద్యోగిగా పని చేశానని… ఆ తర్వాత మీడియాలో ప్రవేశించానని అనసూయ తెలిపింది. టెలివిజన్ షోలలో యాంకర్ గా పని చేశానని… ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పింది. మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేశానని… ఆ సమయంలో ఆయనతో తనకు అపైర్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఆ సమయంలో తాను గర్భవతినని… ఆ వార్తలతో తాను చాలా భయపడిపోయానని చెప్పింది. అయితే, తన భర్త తనకు అండగా నిలబడ్డారని… నేను నమ్మనంత వరకు నీవు భయపడాల్సిన అవసరం లేదని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. తన కుటుంబసభ్యులు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని… అందుకే యాక్టింగ్ కెరీర్ లో కొనసాగుతున్నానని చెప్పింది.