శ్రీ రెడ్డి  అన్నంత పని చేసేసింది…

వాస్తవం సినిమా: శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా.. కేసీఆర్ గారూ మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరింది. ఈ క్రమంలో అన్నంత పని చేసింది శ్రీ రెడ్డి. ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో అర్ధ నగ్నంగా కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనను తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీ రెడ్డిని అరెస్ట్ చేశారు.

గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అంతే ఘాటుగా ఇండస్ట్రీ వ్యక్తుల గురుంచి లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో టాలీవుడ్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలపై  రోజుకో పేరు బయటపెట్టి సంచలనం సృష్టిస్తోన్న ఆమె… మరో రెండు బాంబ్‌లు పేల్చారు. త్వరలోనే మరికొంతమంది గుట్టు విప్పుతానంటూ మళ్లీ విరుచుకుపడింది. తప్పు చేసినవాడు ఎవడైనా… రెడ్డి అయినా తాట తీస్తా… త్వరలో రెడ్డిగారి గానా భజానా ప్రసారమని పోస్ట్ పెట్టింది.