డ్రగ్స్ కేసులో ముగ్గురిపై చార్జ్ షీట్ ఓపెన్ చేసిన సిట్ అధికారులు

వాస్తవం ప్రతినిధి: గతేడాది డ్రగ్స్ ఉదంతం అమాంతంగా టాలివుడ్ నే కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు టాలివుడ్ ప్రముఖుల పై ఆరోపణలు రావడం వారిని సిట్ విచారించడం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో సిట్ విచారణకు హాజరైన ప్రతి ఒక్కరి నుంచి చేతి గోళ్లు,వెంట్రుకలు, రక్తం తదితర వాటిని శాంపిల్స్ గా తీసుకున్నారు. అయితే వాటిని ఫోరెన్సిక్ అధికారులు పరీక్షలు జరిపి ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో తెలుసుకున్నారు. అయితే ఈ విలువైన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఒక దర్శకుడు, ఇద్దరు హిరోలపై చార్జ్ షీట్ ఓపెన్ చేసినట్లు సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇప్పటి వరకు ముగ్గురి శాంపిల్స్ మాత్రమే రావడం తో వారి పైనే చార్జ్ షీట్ ఓపెన్ చేశామని,త్వరలో మిగిలిన నివేదికలు కూడా వచ్చాక వారిపై కూడా చార్జ్ షీట్ ఓపెన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు .