స్ట్రోమీ పై తొలిసారి స్పందించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల పోర్న్ స్టార్ స్ట్రోమీ డేనియల్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో 2006లో తనకు అఫైర్‌ ఉందని, అది బయటపెట్టకుండా ఉండేందుకు తనకు 2016 అక్టోబరులో ట్రంప్‌ ప్రైవేట్‌ అటార్నీ మైకేల్‌ కోహెన్‌  1,30,000డాలర్లు చెల్లించారని స్ట్రోమీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే స్ట్రోమీ వ్యాఖ్యలపై ఎట్టకేలకు ట్రంప్ నోరు విప్పారు. ఈ వివాదం తలెత్తిన తర్వాత ట్రంప్‌ మొట్టమొదటిసారి గురువారం దీనిపై మాట్లాడుతూ…..స్ట్రోమీకి 1,30,000డాలర్లు చెల్లించినట్లు తనకు తెలియదని ట్రంప్ వెల్లడించారు. పోర్న్‌ స్టార్‌ స్ట్రోమీ డేనియల్స్‌కు కోహెన్‌ డబ్బు చెల్లించినట్లు మీకు తెలుసా? అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానం ఇచ్చారు.