సల్మాన్ కి శిక్ష విధించడం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి

వాస్తవం ప్రతినిధి:  బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు కృష్ణ జింకలను కాల్చిన కేసులో జోధ్ పూర్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ కు విధించిన ఈ శిక్ష పై పొరుగు దేశం అయిన పాకిస్తాన్ ఎక్కువగా స్పందిస్తుంది. సల్మాన్ కు విధించిన శిక్షపై  పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో కోర్టు తీర్పుపై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మైనార్టీలపై వివక్ష ఉంటుందని, వారికి ఆ దేశంలో రక్షణ ఉండదని మరోసారి రువైంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  సల్మాన్‌ పేరు చివర ఖాన్‌ లేకుంటే తీర్పు వేరేలా వచ్చి ఉండేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లోని అధికార పార్టీ మతాన్ని సల్మాన్‌ కలిగి ఉంటే ఈ శిక్షకు అనర్హుడై ఉండేవా ఆరోడంటూ ఆయన ఆరోపించారు. మరోపక్క ఈయన గారి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.  సల్మాన్‌ ఖాన్‌, అతని మతంపై మీకు అంతలా ప్రేమ ఉంటే ఆ హీరో సినిమాలు (ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందాహై) పాక్‌లోని థియేటర్లలో ఎందుకు ఆడనివ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇదే కేసులో నిర్ధోషిగా బయటపడ్డ సైఫ్‌ అలీఖాన్‌ది ఏ మతమో మంత్రి చెప్పాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా భారత్ లో అందరూ సమానం అని దానికి నిదర్సనం పలు కేసులలో దోషులుగా తేలిన వారిలో మతం తో సంబంధం లేకుండా ఉన్న విషయాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అయినా మీ సమస్యల పరిష్కారం చూసుకున్నాక పక్క దేశం గురించి ఆలోచించండి మంత్రి గారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.