‘మోహన్ రంగ’ పాత్రలో నితిన్ అదరగొట్టేశాడుగా..

Chal Mohana Ranga Movie HD Photos Stills | Nithin, Megha Akash Images, Gallery | Chal Mohan Ranga Photos

వాస్తవం సినిమా: నితిన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ‘ఛల్ మోహన్ రంగ’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ తో పాటు త్రివిక్రమ్.. పవన్ కల్యాణ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. యూత్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా టాక్ ఎలా ఉందనే సంగతి అటుంచితే, ‘మోహన్ రంగ’ పాత్రలో నితిన్ అదరగొట్టేశాడని అంటున్నారు.

అతికష్టం మీద అమెరికా వెళ్లి .. అక్కడ ఉద్యోగం దొరక్క నానా ఇబ్బందులు పడే పాత్రలో ఆయన చాలా బాగా చేశాడని చెబుతున్నారు. మోహనరంగ పాత్రలో నితిన్ ఎంతగానో ఇమిడిపోయాడనీ .. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆయన చూపించిన జోష్ బాగా ఆకట్టుకుందని అంటున్నారు. ఇక గత చిత్రాలతో పోలిస్తే .. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ విషయంలో నితిన్ మరింత పరిణతి చూపించాడని చెబుతున్నారు. ‘పెద్దపులి’ పాటలో ఆయన డాన్స్ మాస్ ను ఊపేస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.