మరోసారి రిపీట్ అవుతున్న క్రేజీ కాంబో

వాస్తవం సినిమా: ప్రముఖ కథానాయకుడు సూర్య నటించిన “సింగం” సిరీస్ లు ప్రేక్షకులను ఏ విధంగా అలరించాయో, ఎంతగా వసూళ్ళు రాబట్టాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే దర్శకుడు హరి ఆ ‘సింగం’ త్రయాన్ని మలచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి అభిమానులను మంత్రముగ్ధులను చేయడానికి రెడీ అయిపోయారు. కాని ఈ సారి ‘సింగం’ కు కొనసాగింపుగా మాత్రం కాదండోయ్..

ఇటీవల దర్శకుడు హరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. సూర్యతో మరో ఒక సినిమా తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం హరి ప్రస్తుతం విక్రమ్‌ కథానాయకుడిగా “సామి 2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం సూర్యతో సినిమా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఎన్‌జీకే” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ ప్రీత్‌, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.