భారత్ కు రెండు స్వర్ణాలు

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా ఆతిధ్యంలో 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్ కోస్ట్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్ రెండో రోజు కూడా ఆదరగోట్టింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. గురువారం వెయిట్ లిఫ్టింగ్ లో గురురాజా  రజతం, అలానే మీరాబాయి స్వర్ణం తో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. దీనితో భారత్‌ ఇప్పటి వరకు గెలిచిన మూడు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే దక్కడం విశేషం. ‘భారతీయ నారీమణులు అందరి కంటే ఎంతో గొప్పవారు. మరో స్వర్ణం గెలిచాం. భారత్‌కు రెండో బంగారు పతకం అందించిన సంజితా చానుకు అభినందనలు అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.అలానే పలువురు ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో సంజితా చాను 48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్(12),ఆస్ట్రేలియా(15) తో అగ్రస్థానం లో కొనసాగుతుండగా, భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.