ద.కొరియా నైరుతి ప్రాంతం లో కూలిన యుద్ద విమానం!

వాస్తవం ప్రతినిధి: ద.కొరియా రాజధాని నైరుతి ప్రాంతంలో వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం కూలి పోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో యుద్ద విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు కూడా దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ద.కొరియా సంయుక్త సైనిక విన్యాసా లతో ఈ విమానానికి ఎటువంటి సంబంధమూ లేదని అధికారులు చెప్పారు. సైనిక విన్యాసాలు జరుగుతున్న ప్రాంతం నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ విమానం కూలిపోయిందని వాయుసేనకు చెందిన ఒక అధికారి వివరించారు. అయితే  ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.