త్వరలో శుభవార్త చెబుతానంటున్న నివేదా

వాస్తవం సినిమా: వరుస విజయాలను అందుకొంటూ దూసుకెళుతున్న కథానాయికల జాబితాలో నివేదా థామస్ కూడా కనిపిస్తుంది. ‘జెంటిల్ మేన్’ .. ‘నిన్నుకోరి’ సినిమాల ద్వారా యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి పరిచయమైన నివేదా, ‘జై లవకుశ’ సినిమాతో మాస్ ఆడియన్స్ ను కూడా అలరించింది. ఆ తరువాత ఆమె కొన్ని రోజుల పాటు సినిమాలను దూరం పెట్టి, తాను చేస్తోన్న కోర్స్ కి సంబంధించి లాస్ట్ సెమిష్టర్ పై దృష్టి పెట్టింది. ఆ సెమిష్టర్ పూర్తికావడంతో మళ్లీ తన తదుపరి సినిమాల కోసం కథలు వినడం మొదలుపెట్టేసింది. తనకి నచ్చిన స్క్రిప్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తన తదుపరి సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెబుతోంది. ఇక నివేదా ఏ స్టార్ హీరోల జోడీగా ఛాన్సులు కొట్టేస్తుందో .. ఎన్నేసి సక్సెస్ లు పట్టేస్తుందో చూడాలి.