కోన వెంకట్ పై నెటిజన్ల ఫైర్

వాస్తవం సినిమా: కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు సానుభూతిపరులు పెరిగిపోతున్నారు. ఈ జాబితాలో తాజాగా రచయిత, దర్శకుడు కోన వెంకట్ కూడా చేరారు. సల్మాన్ ఖాన్ కేసులో తీర్పు విని తాను షాక్‌కు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. దోషిగా తేలినంత మాత్రాన ఆయన వ్యక్తిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి చాలా దేశాల ప్రభుత్వాలు జంతువుల వేటను అనుమతిస్తున్నాయని.. మొదట మనుషులను కాపాలి అంటూ కోన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఐ సపోర్ట్ సల్మాన్’ అనే హ్యాష్‌టాగ్‌ను కూడా తగిలించారు. అయితే కోన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.మనషుల మీదికి కారును ఎక్కించినప్పుడు ఏమైంది మీ మానవత్వం అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ‘ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీల కోసం న్యాయ, నిబంధనలు మార్చుకుంటూ పోవాలా.. మా ఇండియాలో అయితే అనుమతించం సర్. మీరు కావాలంటే వేరే దేశం వెళ్లి వేటాడుకోండి’ అంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు.