ఓరి నా భగవంతుడా !!!

ఇదేనా , ఇంతేనా , అనువాదం లో వాదం వస్తే “పరభాష లో మనభాష ” అనువాదం ఒక అంశం అన్న మాట .అంతంత మాత్రం గా ఉందమ్మా మా పిల్లకాయ భాష మాటాడితే , వ్రాత రాదు .ఇక్కడకూడా మాట్లాడితే లేదా మాటాడితే అన్న సందేహం 😊
ఇన్ని సందేహాలు మనదేహాలకు అవసరమా , ఒత్తిడి తప్ప ఏముంది ?” మీ కేమి ,ఇంట్లో మాతృభాషను ప్రేమిస్తూ , గౌరవిస్తూ , ఏ ఇతర భాషలను దత్తత తీసుకోలేదుగా అని వ్యంగం “ఏది ఏమైనా , వాదం వివాదం నాకొద్దు గానీ బుర్రలో ఏముంది , కొబ్బరి నీళ్ళు ఉన్నాయి అంటూ నా చిన్నదానికి ఊసులు , లాలను పోసి , ఆటలు , పాటలు ఇంకా సొంత మాటల్తో గొలుసు ఆట ఆడిస్తూ ,ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు..

“అమ్మా !!!అమ్మ భాష అంటే ఏంటి ?
అమ్మకు ఎన్ని భాషలుంటాయి ?
అమ్మ ఎక్కడ నేర్చుంటే ఆ పేరు వచ్చింది ?”, చెప్పు , చెప్పు అన్నప్పుడే నాకు పరభాషలోని చిత్రం కొన్న
జ్ఞాపకం తీసి చూసుకున్నాను 😊.
అమ్మకు ఇలాంటి బుజ్జాయినేస్తం

వ్రాసినది ..దివ్య చేవూరి , లిటిల్ ఎల్మ్ , టెక్సాస్