11 సార్లు వాయిదా పడ్డ రాజ్య సభ….కొత్త రికార్డ్

New Delhi: A view of Rajya Sabha in New Delhi on Friday, during the ongoing winter session of Parliament. PTI Photo / TV GRAB (PTI12_22_2017_000052B)

వాస్తవం ప్రతినిధి: రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే 11 సార్లు సభ వాయిదా పడడం తో కొత్త రికార్డ్ నెలకొల్పింది. నిరసనలతోపాటు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా  నిన్న సభ అన్ని సార్లు వాయిదా పడింది. అవినీతి నిరోధక (సవరణ) బిల్లు–2013పై చర్చ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య వివాదంతో రికార్డు స్థాయిలో వాయిదాల పర్వం కొనసాగింది. దీనితో విపక్షాల తీరుపై  రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.