సమతావాది, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ 111 వ జయంతి నేడు

Babu Jagjivan Ram former Defence Minister in 1977. Express photo by R K Sharma

వాస్తవం ప్రతినిధి: స్వాతంత్య్ర సమరయోధులు, సమతావాది, భారత మాజీ ఉపప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి నేడు. ఈ నేపధ్యంలో ఏపీ  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి గురువారం జగ్జీవన్‌రామ్‌ 111వ జయంతి వేడుకలను చిత్తూరులోని గంగినేని చెరువుకట్ట వద్ద నిర్వహించారు. అక్కడే పార్క్ లో మొదట ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్‌ గీర్వాణి చంద్రప్రకాష్‌, నగర మేయర్‌ కటారి హేమలత, జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, జెసి గిరిషా, అన్ని దళిత సంఘాల నాయకులు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి, నాని తదితరులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.