‘భరత్ అనే నేను’ నుంచి మరో పాట

వాస్తవం సినిమా: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తాజాగా కొరటాల శివ దర్సకత్వం లో  నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. బాలివుడ్ నటి కైరా అడ్వాణి కధానాయిక పాత్ర పోషిస్తుంది. అయితే చిత్రీకరణ చివరి దశలూ ఉన్న ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వం లో వస్తుండడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు మొదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు అందించిన బాణీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్‌ 20న సినిమా విడుదల అవుతుండగా, ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. కాగా ఏప్రిల్‌ 5న సినిమాలోని మరో పాటను విడుదల చేయనున్నట్లు మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘ఎంజాయ్‌ చేయండి’ అని ట్వీటారు. ‘వస్తాడయ్యా సామి’ అని సాగే ఈ పాటను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే మహేశ్ ట్వీట్ కు దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందించారు. ‘ఈ పాట మిమ్మల్ని మెప్పించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలు సమకూర్చారు.. రామజోగయ్య శాస్తి సూపర్‌ సాహిత్యం అందించారు. మహేశ్‌ ఫొటో ఆ విషయాన్ని తెలుపుతోంది’ అని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ చిత్రం నుంచి విడుదలైన కొత్త పోస్టర్ చూస్తే వారికైనా అర్ధం అవుతుంది. ఆ కొత్త పోస్టర్ లో పంచెకట్టులో మహేశ్‌ చిందులేస్తూ కనపడుతున్నాడు. దీనితో  ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.