జాతీయ రహదారి పాద యాత్రపై సూచనలు చేసిన జనసేనాని

వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా ఏపీ కి అన్యాయం చేస్తుందన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం, సీపీఐ, సీపీఎం నేతలతో భేటీ అయిన చర్చలు జరిపిన అనంతరం కేంద్రం ఏపీ కి అన్యాయం చేస్తుందని, నమ్మక ద్రోహం చేస్తుంది అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా శుక్రవారం(6వ తేదీ) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించి ట్విట్టర్‌ వేదికగా పవన్‌.. జనసైనికులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఆ సూచనలు ఈ విధంగా ఉన్నాయి.

1.జాతీయ రహదారి ఉన్న ప్రాంతాల వారు విధిగా రహదారిపైనే పాదయాత్ర చేయాలి.

2. జాతీయ రహదారి లేనివారు తమ ప్రాంతాల్లోని ప్రధాన కూడలి నుంచి పాదయాత్ర ప్రారంభించాలి.

3. ఉదయం సరిగ్గా 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించాలి, గంటపాటు కొనసాగేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.

4. పాదయాత్ర లో ఫస్ట్ ఎయిడ్ కిట్, మంచినీళ్లు సిద్దం చేసుకోవాలి.

5. పోలీసులు అరెస్టులు,నిర్బంధాలకు పాల్పడితే ఎటువంటి రక్షణాత్మక చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించుకోవాలి.

6.ఈ కార్యక్రమంలో అసాంఘీక శక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.