వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కి ఒక్క సీటు కూడా రాదు: జలీల్ ఖాన్

వాస్తవం ప్రతినిధి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటూ కూడా రాదంటూ  టిడిపి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ జోస్యం చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసిపి రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన అవినీతి ప్రతి ఒక్కరికీ తెలుసని ఆయన అన్నారు.