మహిళల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

వాస్తవం ప్రతినిధి: తల్లులు జీన్స్ ధరించడం వల్లే పిల్లలు ట్రాన్స్ జెండర్స్ గా మారుతున్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తిరువనంతపురం కేరళ కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రజిత్ కుమార్ విద్యార్ధుల కౌన్సెలింగ్ కార్యక్రమానికి హాజరైన ఆయన మహిళలు జీన్స్ ధరించడం వల్లే  వారికి పుట్టబోయే ఆడ పిల్లలు పురుషుడి లక్షణాలతో పుడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లులు పురుషులల వ్యవహరించడం వల్లే వారి సంతానం ట్రాన్స్  జెండర్స్ గా మారుతున్నారని ఆయన అన్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడి వివాదా స్పద వ్యాఖ్యల తో పెను దుమారం రేగుతుంది. ఆ టీచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అటు మహిళా సంఘాలు,విద్యార్ధి సంఘాలు  డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉపాధ్యాయుడు రజిత్ కుమార్ ని ఇక నుంచి ఏ  కార్యక్రమానికి కూడా ఆహ్వానించొద్దు అంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి శైలజ, ఆన్నీ ప్రభుత్వ సంస్థ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.