బొమ్మ తుపాకీ అనుకోని నిజం తుపాకీ తో అన్నని కాల్చిన ఐదేళ్ల బాలుడు!

వాస్తవం ప్రతినిధి: అమెరికా లో ఇటీవల గన్ కల్చర్ పెరిగిపోవడం తో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లు తుంది. ఈ నేపధ్యంలో గన్ కల్చర్ ని అరికట్టాలి అంటూ ఎందఱో ఆందోళనలు చేస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులలో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా ఈ గన్ కల్చర్ కారణంగా ఐదేళ్ళ బాలుడు,ఏడేళ్ల సోదరుడిని కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. అమెరికా లోని వాషింగ్టన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే….. ఏడేళ్ల జెర్మన్‌ పెర్రి సౌత్‌ సెంట్‌ లూయిస్‌లోని తమ ఇంట్లో బెడ్‌రూమ్‌లో కూర్చుని వీడియో గేమ్‌ ఆడుకుంటున్నాడు. తల్లి వంటగదిలో ఉంది. పెర్రి తమ్ముడు చాక్లెట్ల కోసం తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి కప్‌బోర్డులో వెతకడం ప్రారంభించాడు. అయితే చాక్లెట్ కోసం వెతికిన ఆ బాలుడికి గన్ దొరికింది. అయితే బొమ్మ తుపాకీ అని భావించిన ఆ బాలుడు తమ గదిలో వీడియో గేమ్ ఆడుకుంటున్న పెర్రి ని కాల్చాడు. ఇదంతా ఆ పసివాడికి తాను నిత్యం ఆడే వీడియో గేమ్‌లానే తోచింది. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం విన్న తల్లిదండ్రులు ఆ గదిలోకి వచ్చి చూసేసరికి పెర్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెర్రీ మృతి చెందాడు. మృతుడి తండ్రి జెరికో పెర్రీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ బాలుడు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్‌ ఉందని తెలిపారు.