ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణా రాజ్యసభ సభ్యులు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యుల చేత ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు తెలంగాణా రాజ్యసభ సభ్యులైన జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆత్మసాక్షిగా వీరంతా ప్రమాణం చేశారు. అనంతరం ఈ ముగ్గురు సభ్యులు.. వెంకయ్యనాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు తెలుగులోనే ప్రమాణస్వీకారం చేసినట్లు తెలుస్తుంది.