పీఎన్ బీ కుంభకోణం లో ఆర్ బీ ఐ దే తప్పు: విజిలెన్స్ కమీషనర్  

వాస్తవం ప్రతినిధి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ముంబై బ్రాంచి లో భారీ కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుంభకోణం విషయంలో భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ)దే తప్పు అంటూ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్(సీవీసీ) కేవీ చౌదరి గారు అభిప్రాయపడ్డారు. పీఎన్‌బీ బ్యాంకులో కుంభకోణం జరిగిన సమయంలో రిజర్వు బ్యాంకు సరైన ఆడిట్స్‌ నిర్వహించలేదని, పటిష్ట ఆడిటింగ్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ ఆయన అన్నారు. బ్యాంకుల్లో రిస్క్‌లను గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆడిటింగ్‌ చెయ్యాలి. కానీ పీఎన్‌బీలో సమయానుసారంగా ఆర్బీఐ అలా స్పష్టంగా ఆడిటింగ్‌ చేయలేదని చౌదరి ఆరోపించారు.