పార్లమెంట్ లో ఆందోళనకు దిగిన పంజాబ్ ఎంపీలు!

వాస్తవం ప్రతినిధి: ఇరాక్‌లోని మోసూల్‌లో ఐసిస్‌ ఉగ్రవాదుల చేతిలో హతమైన 39 మంది భారతీయుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలంటూ పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ సాక్షిగా ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఎంపీలు అందరూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఉపాధి నిమిత్తం 2014లో 40 మంది భారతీయులు ఓ ఏజెంట్‌ద్వారా ఇరాక్‌ వెళ్లి,అక్కడ ఐసిస్‌ ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా మారారు. అయితే వారిలో పంజాబ్ కి చెందిన వ్యక్తి తప్పించుకొని భారత్ కు చేరుకున్నాడు. అయితే మిగిలిన 39 మందిని ఐసిస్ అతికిరాతకంగా హత్య చేసింది. దీనితో వీరి మృత దేహాలను సోమవారం ప్రత్యేక విమానం లో భారత్ కు చేరాయి. అయితే 39 మందిలో ఒక్కరి డీఎన్ఏ నమూనా లో తేడా రావడం తో 38 మృతదేహాలను మాత్రమే భారత్ కు తరలించారు. మృతుల్లో 27 మంది పంజాబీలు కాగా నలుగురు హిమాచల్‌ప్రదేశ్‌, ఆరుగురు బీహార్‌, ఇద్దరు పశ్చిమబెంగాల్‌కు చెందినవారు. ఈ నేపధ్యంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విపక్షాలు చేశాయి. దీనితో స్పందించిన కేంద్రం వెంటనే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించింది.