తప్పని ఒప్పుకోక పొతే చట్ట పరంగా చర్యలు: శేఖర్ కమ్ముల

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ను కూడా ఉద్దేశిస్తూ ఓ తెలుగు నటి కొందరు దర్శకులు, నిర్మాతలు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేస్తూ సోషల్‌మీడియాలో సంచనాత్మక పోస్ట్‌లు పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఆమె పోస్ట్ పై శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అసత్యం, అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా బాధ కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్‌గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏదైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. నేను నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. అని పేర్కొన్నారు కమ్ముల.