క్రీడాకారుల బయోపిక్ లో నటించే ధైర్యం లేదు: ఎన్టీఆర్

వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్ తెలుగు ప్రసారాల ప్రచార కర్తగా ప్రముఖ కధానాయకుడు ఎన్టీఆర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ….క్రీడలకు భాష తో సంబంధం లేదు. క్రికెట్ భారత్ లో ఒక అంతర్భాగం.  నాన్నకు క్రికెట్ అంటే మక్కువ. ఆయనను చూస్తూ నేను కూడా క్రికెట్ పై అభిమానం పెంచుకున్నాను. అలానే రేపు నా కొడుకు అభయ్ కూడా క్రికెట్ అంటే అభిమానం పెంచుకుంటాడెమో.  క్రికెట్‌పై ప్రేమ వారసత్వంగా వస్తుందనిపిస్తుంది. క్రికెట్ ని ప్రేమిస్తా,ఆడతాను కూడా. చిన్నప్పటి నుంచి సచిన్ చూస్తూ పెరిగా. క్రీడాకారుల బయోపిక్ లు చేస్తే చాలా బాగుంటుంది. కానీ క్రీడాకారుల బయోపిక్‌లలో నటించే ధైర్యం నాకు లేదు. నేనో ప్రొఫెషనల్ బ్యాట్మింటన్ ఆటగాడిని. కానీ ఇప్పుడు మాత్రం క్రికెట్,ఫుట్ బాట్,రగ్బీ ఆటలు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ లను చూస్తుంటాను కూడా. అయితే ఐపీఎల్ కి ప్రచార కర్త నే అయినా నా మద్దతు మాత్రం సన్ రైజర్స్ కే. అయితే క్రికెట్ వ్యాఖ్యానం గురించి ఇంకా ఆలోచించలేదు.  క్రికెట్‌తో నేను నేర్చుకున్నది వినయం. ఆరు గంటల పాటు ఉద్విగ్నంగా జరిగే ఆటలో ఆటగాడు ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాడు. ఫలితం అతని చేతుల్లో ఉండదు కాబట్టి తన పని తను చేసుకుపోతాడు. క్రికెట్‌ నుంచి నేను నేర్చుకున్నది అదే’’ అని తెలిపాడు.