కామన్వెల్త్ క్రీడల వీక్షణకు సైనా తండ్రిని అనుమతించిన ఐఓఏ 

వాస్తవం ప్రతినిధి:  కామన్వెల్త్‌ క్రీడల కోసం అందరూ సన్నద్ధమై గోల్డ్ కోస్ట్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రీడలు జరిగే క్రీడా గ్రామంలోకి సైనా నెహ్వాల్‌ తండ్రి హర్విర్ సింగ్ ను అనుమతించక పోవడం తో తీవ్ర ఆగ్రహానికి గురైన సైనా తన తండ్రిని అనుమతించక పొతే బ్యాట్మింటన్ టోర్నీ నుంచి తప్పుకుంటానని సైనా హెచ్చరించింది. ఈ నేపధ్యంలో దోగోచ్చిన భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) సైనా తండ్రిని కామన్వెల్త్ గేమ్స్ కి అనుమతిస్తూ సైనా ఆడే అన్నీ మ్యాచ్ లను చూడవచ్చని వెల్లడించింది. కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లే ముందు మా నాన్న పేరు.. జట్టు అధికారిగా జాబితాలో ఉంది. అందుకైన ఖర్చులను కూడా మేమే చెల్లించాం. కానీ క్రీడాగ్రామం దగ్గరకు వచ్చేసరికి ఆయన పేరును అధికార్ల జాబితా నుంచి తీసేశారు.. ఇదేంటని సైనా ట్విటర్‌ ద్వారా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించిన ఐఓఏ క్రీడాగ్రామంలోకి ఆమె తండ్రి ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఆయన బస చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఐఓఏ వెల్లడించింది. తన తండ్రి వచ్చేందుకు అంగీకరించినందుకు ఐఓఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా, ఐఓఏ బృందానికి సైనా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ తనకు అండగా నిలిచి సహాయం చేశారని ఆమె వెల్లడించారు.