కర్ణాటక లో పర్యటించిన రాహుల్….మోదీ పై విమర్శలు!

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక లో ఎన్నికలు దగ్గర పడుతుండడం తో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్, అలానే ఈ సారి అధికారం లోకి రావాలని ఇటు బీజేపీ కసరత్తులు మొదలు పెట్టింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక లో మంగళ వారం పర్యటించారు. కర్ణాటక లోని శివ మొగ్గ,దావణగెరె జిల్లా లలో ఆయన పర్యటించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పై విరుచుకుపడ్డారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, ఆయన్ను సాగనంపాలని రాహుల్‌గాంధీ కోరారు. వేల కోట్లు లూటీ చేసిన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మోదీ  హయాంలో దేశంలో అవినీతి తాండవిస్తోందని ఆయన మండిపడ్డారు. అలానే ఆయన అధికారంలోకి వస్తే రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు ఎక్కడ ఇచ్చారో తెలిపాలని రాహుల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల రుణ మాఫీ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఈ సారి ఎన్నికల్లో బీజేపీ కి,మోదీ కి ప్రజలు బుద్ది చెప్పాలి అంటూ రాహుల్ పిలుపు నిచ్చారు.