ఈ రోజు నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ క్రీడలు

వాస్తవం ప్రతినిధి: ఈ రోజు నుంచి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ క్వీన్స్‌లాండ్‌ లోని కర్రారా మైదానంలో నేటినుండి ఈ గేమ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్‌ 4 నుండి 15 వరకు జరిగే ఈ గేమ్స్‌లో 71 దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను చూపనున్నారు. 19 క్రీడాంశాలలో 275 విభాగాలలో స్వర్ణ, రజిత, కాంస్య పతకాలకై వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీపడనున్నారు. భారతదేశం తరఫునుండి 15 క్రీడాంశాల్లో 115మంది పురుషులు, 105మంది మహిళలతో సహా మొత్తం 220 మంది ఈసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో తమ ప్రతిభను చూపి పతకాలు సాధించడానికి కృషి చేయనున్నారు. అయితే ఈ సారి కూడా పతకాల పంట పండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ కామన్‌వెల్త్‌ గేమ్స్ లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి.