ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నాం: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలలోనూ, అమరావతి శంకుస్థాపన సభలోనూ, పార్లమెంటులోనూ ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నామనీ, అంతకంటే ఎక్కువ ఏమీ అడగడం లేదని చంద్రబాబు చెప్పారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయన ఇస్తామన్నవే ఇవ్వమని అడుగుతుంటే రాష్ట్రాన్ని వేటాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన ఏ హామీనీ అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తున్నదన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రజల భావన, వారి సెంటిమెంట్ దెబ్బతిందని, ఆగ్రహం వ్యక్తమౌతున్నదని చంద్రబాబు చెప్పారు.