ఆజం ఖాన్ పై నమోదైన దేశ ద్రోహం కేసు కొట్టివేత!

వాస్తవం ప్రతినిధి: సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌పై ఇటీవల నమోదైన దేశద్రోహం కేసును కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తుంది. కాశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ భాగంగా పోలీసులు సమర్పించిన తుది నివేదికను తిరస్కరించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అమర్ జీత్ సింగ్ ఆజం ఖాన్ పై నమోదైన కేసును కొట్టివేసినట్లు తెలుస్తుంది. అజంఖాన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు సమర్పించిన తుది నివేదికను తిరస్కరించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అమర్‌జీత్ సింగ్ అజంఖాన్‌పై నమోదైన దేశద్రోహం కేసును కొట్టివేశారు. 2010 డిసెంబర్ 21న కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజంఖాన్‌పై బజరంగ్‌దళ్ కార్యకర్త ఉజ్జావల్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, తాజాగా ఆ కేసును కొట్టేశారు.