సైనా తండ్రికి చేదు అనుభవం

వాస్తవం ప్రతినిధి: స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్‌సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది.  భారత్ నుంచి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో  తమ స్వంత ఖర్చులతో అటు సైనా తన తండ్రి ని, ఇటు మరో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా తన తల్లి విమల ను ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గోల్డ్ కోస్ట్ తీసుకువెళ్ళారు. అయితే ప్రభుత్వ ఖర్చు లేకుండా మొత్తం 15 అఫీషియల్స్, నాన్-అథ్లెట్లు గోల్డ్‌కోస్ట్ వెళ్లే భారత బృందంలో ఉన్నారు. తీరా అక్కడి వెళ్లేసరికి తన తండ్రి పేరు జాబితాలో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సైనా ట్విటర్‌లో వరుస ట్వీట్లతో ఆవేదన వ్యక్తం చేసింది. మ‌రోవైపు పీవీ సింధు తల్లిని మాత్రం ఆమెతో క్రీడాగ్రామంలోకి అధికారులు అనుమతించారు.