వీనస్‌ గ్రహంపై గ్రహాంతర వాసుల జాడలు:  నాసా 

 వాస్తవం ప్రతినిధి:   అసలు  గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు  సంబంధించి నిజాన్ని బ‌య‌ట‌పెట్టింది నాసా.వీనస్‌ (శుక్ర గ్రహం) గ్రహంపై గ్రహంతరవాసుల ఆనవాళ్లను కనుగొన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది.   వీనస్‌ మేఘాల్లో నల్లటి జాడలను, జీవ పదార్థాన్ని గుర్తించామని, అక్కడే ఏలియన్లు నివసిస్తూ ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపింది. వీలైనంత త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆ గ్రహంపై ప్రతికూల వాతావరణం ఉందని, తాము 500 డిగ్రీ సెల్సియస్‌ ఉష్టోగ్రతతో ఆమ్ల వర్షంతో ఆ పరిస్థితులను తట్టుకుని పరిశోధనలు చేస్తామని తెలిపింది. ఈ విషయంపై బయోకెమికల్‌, రసాయనిక అధ్యయనాలు చేపట్టనుంది. ఇందు కోసం 240 మిలియన్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.