రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్న ధోనీ

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సోమవారం పద్మ భూషణ్ అవార్డ్ ని అందుకున్నాడు. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ధోనీ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరుకాగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించినట్లు తెలుస్తుంది.