మోదీ,బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గోరంట్ల

వాస్తవం ప్రతినిధి: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై టిడిపి సీనియర్‌ నేత, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి లో విలేఖరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మోదీ పై బీజేపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు మోదీ లు దేశాన్ని దోచుకుంటున్నారని,బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు. అసలు బీజేపీ నేతలే పెద్ద దోపిడీ దారులని , రాఫెల్‌ యుద్ధ విమానాలలో బిజెపి రాఫెల్‌లో రూ.30 వేల కోట్ల పైబడి అవినీతికి పాల్పడిందని గోరంట్ల ఆరోపించారు. అలానే పెట్రోల్‌ పేరుతో లక్షల కోట్లు కేంద్రం ఖాజానాలో జమ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌కు ఏమి ఇస్తున్నారో చెప్పాలన్నారు. గుజరాత్‌ అవినీతిపై కాగ్‌ ఇచ్చిన నివేదికకు ముందు బిజెపి నేతలు సమాధానం చెప్పాలన్నారు. కావాలనే అన్నాడీఎంకే సభ్యులతో పార్లమెంట్‌లో బిజెపి ఆందోళన చేయిస్తోందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.